కరోనా తో విద్యావ్యవస్థ ఎదుర్కుంటున్న అవస్థలు. ...

కరోనా తో విద్యావ్యవస్థ ఎదుర్కుంటున్న అవస్థలు. .....  ఎదుర్కునే సవాళ్లు!!                   

కనీ వినీ ఎరుగని రీతిలో  యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 వైరస్,, ప్రభావం అన్ని రంగాలను ప్రభావితం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు!!        

 ధనిక,, పేద చిన్న,, పెద్ద,,, వర్ణ,, వైషమ్యాలు, లేకుండా అన్నింటినీ చిన్నాభిన్నం చేసి,,, నేటికీ అన్ని అంశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వలన నష్ట పోయిన నష్ట పోతున్న వాటిలో అతి ముఖ్యమైన అంశం,,, విద్యారంగం!!                               
గత మార్చ్ నెల నుండి నేటిదాకా కూడా ఇంకా స్పష్టతకు రాలేక పోతున్నాం,, విద్యాలయాల పునఃప్రారంభం గురించి!!                                  
 ఎందుకంటే,,, అతి సున్నితమైన రోగనిరోధక శక్తిని కలిగిన పిల్లలు పెద్ద మొత్తంలో కరోనా మహమ్మారి బారిన పడితే,,, జరిగే నష్టం ఊహకు అందనిది,, పూ డ్చలేనిది!!             

అలాగని, పిల్లలను బడులకు దూరంగా ఉంచు తూ,,, విద్యాప్రమాణాలు,,, మరియు వాళ్ళ ప్రజ్ఞా పాటవాలు మెరుగు ప రచడం ఒక రకంగా తల్లిదండ్రులకు పెద్ద పరీక్షా సమయం!!                               
తల్లి ఒడిలో కొన్ని గంటలు మాత్రమే గడిపి,,, మిగతా సమయం మొత్తం కూడా తల్లి కన్నా మిన్నగా పిల్లలను అక్కున చేర్చుకుని,,, విద్యా బుద్దులు ఆటపాటలు నేర్పుతూ,,, ప్రపంచ జ్ఞానాన్ని అందించే విద్యాలయాలు,,, నేడు వెలవెల బోయి పిల్లలకోసం నిరీక్షించే తల్లిలా తల్లడిల్లి పోతున్నాయి!!               
ఇక ఉపాధ్యాయుల వేదన అరణ్య రోదన!                           ఇంట్లో పిల్లలను వదిలి ఒక్కరోజైనా ఉండగలరేమో,?? కానీ, తమతో అల్లుకున్న విద్యార్థి బిడ్డల అనుబంధానికి,,,, దూరంగా ఇంకెన్నాళ్ళు ఈ ఎడబాటు అని తపించని ఉపాధ్యాయులు లేరంటే, అతిశయోక్తి కాదేమో!     
            
 ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన జీవన విధానం ఎన్నడూలేని దుర్భర పరిస్థితులు,, అభిమానంతో అడుక్కో లేక,,,,ఆత్మహత్యలతో,,,,అవమానాల తో,,, అప్పులతో,,, చావలేక బతుకలేక కొట్టుమిట్టాడుతూ బతకలేక బడిపంతులు అన్న చందంగా సాగుతున్నాయి!                       

 భూమిపై ఏ విషయంలోనైనా స్వార్థ పరత ఉంటుంది,,ఎదుటివారు ఎదుగుతూ ఉంటే అసూయ ఉంటుంది,, కానీ ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే,,,, తను పంచిన జ్ఞానంతో తనకన్నా ఎత్తుకు తన పిల్లలు ఎదగాలని అనుకుంటారు.            

అయితే ఈ జాతీయ విపత్తు విలయ తాండవం చేస్తున్న ఈ విషమ పరి స్థితు ల్లో, ఏ తల్లి దండ్రి అయినా పిల్లలను బడులకు పంపే సాహసం చేయరు అనేది కూడా కాదనలేని వాస్తవం!              

 లేత మొగ్గలు స్నేహితుల మధ్య ఆటపాటలతో ,,, హాయిగా అలవోకగా నేర్చుకునే వి ద్యాలయాలు పూర్వ వైభవంతో అలరారే దె పుడో? విద్యాలయాల గర్భగుడి లోని గురుదేవుళ్ల ఒడికి పసి పాదాలు చేరేది ఎపుడో??                

 అయితే ఇక్కడ తప్పు పట్టా ల్సింది ఎవరినీ కాదు ఇక్కడ!! చేయాల్సింది మాత్రం చాలా ఉంది!                                        
ఇక పిల్లల విషయానికి వస్తే,,, అరచేతిలో ప్రపంచం అన్న అంతర్జాలం తో,,, ఆన్ లైన్ క్లాసెస్ మాట దేవుడెరుగు??  

 అర్థరహిత మైన ఆటలు,, చర వాణి ల పుణ్యమా అని,,, తమను తామే మర్చిపోతూ బయట ప్రపంచం తో సంబంధం లేని వాతావరణం లో పిల్లల భవిష్యత్ ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే!!                                  

  అసలే కరోనా లేనప్పుడే ఈ తరం పిల్లలు బయటి ఆటలకు దూరమే,, నిజమైన జ్ఞానానికి అ ల్లంత దూ రమే!!               

ఇక ప్రస్తుత పరిస్థి తి అయితే చెప్పనలవి కాని విషయమే!      అయితే కరోనాతో సహజీవనం అనే వాస్తవం పరిగణన లోనికి తీసుకుంటే, సరియైన ప్రత్యామ్నాయాలు ,,,, భవిష్యత్ ప్రణాళికలు,,, ముందస్తు సురక్షితమైన జాగ్రత్తలతో,,, ఉపాధ్యాయుల,,, పిల్లల భద్రతతో,,,కట్టుదిట్టమైన చర్యలతో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ మూలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనడం సమంజసం! 

ఆన్లైన్ క్లాసెస్ అనే అ ర్ధ జ్ఞానం నాణేనికి ఒక వైపుగానే పరిష్కారంగా  తీసుకుని,,, పూర్తి న్యాయం చేయాల్సిన ఆవశ్యకత అత్యవసరంగా ఉంది అని ఒప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది!                             

 ఏది ఏమైనా, సున్నితమైన విద్యావ్యవస్థ అంశంలో  ,, పాఠశాలల,,, కళాశాలల పునః ప్రారంభం విషయంలో సమగ్రంగా,,, క్షుణ్ణంగా చర్చిస్తూ,,,, పరిశీలిస్తూ, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టుకుని, మన పిల్లల ఆరోగ్యం,,చదువు భవిష్యత్ ను సమతుల్యంగా చేసుకుంటూ, సుస్థిర తను సాధించాల్సిన గురుతరమైన బాధ్యత మందరిమీద ఉంది!!   

  మది ఆత్రేయ

Comments