ఆడజన్మకి అదురుతున్న చేతి రాతతో అశ్రునివాళి !!
ఆడజన్మకి అదురుతున్న చేతి రాతతో అశ్రునివాళి !!
బతికే ఉన్నామా యింకా ఊపిరితో???
చీము నెత్తురు బదులు నరనరాన కామం ప్రవహించే దుర్మార్గపు మనుషుల మధ్య,,,
బతికే ఉన్నామా యింకా ఊపిరితో???
ఎక్కడ ఏ కాలక్షేపపు విషయం జరిగినా
చిలువలు, పలువులు గా తెగ పబ్లిసిటీ ఇచ్చే
అధికార, ప్రతిపక్షా లు,, సంఘాలు,, స్త్రీవాద భావజాలాలు,,
మానవతావాదులు, మేధావి వర్గాలు,,
సామాజికవేత్తలు,,
అక్షరాలతో గుండె బరువు దింపుకునే నాలాంటి సంఘర్షకులు,,
బతికే ఉన్నామా యింకా ఊపిరితో???
తీవ్రవాదాన్ని తలదన్నే సాంఘిక దురాగతాన్ని యింకా ఉపేక్షిస్తే "",
చిన్నారి తల్లులను,,
ఆడబిడ్డలను భవిష్యత్ లో చరిత్రలోనే చదువుకోవాలేమో???
అపురూపమమ్మ ఆడజన్మ అంటూనే,,
చిదిమేస్తుంటే,,,
ఏ తల్లి ధైర్యంగా ఆడపిల్లే కావాలని కోరుకోదేమో??
ఏ తండ్రీ ధైర్యంగా తన ఇంటి బిడ్డను గడప దాటనీయడేమో????
ఎంత ఆదర్శంగా ఆడపిల్లలను పెంచాలనుకున్న,,
ఇలాంటి సంఘటనలతో,,
కామాంధుల కోరల్లో చిక్కకుండా,,
కాపాడుకోవడం తల్లిదండ్రులకు అగ్ని పరీక్షే,,
నోరు,,, వాయి లేని,,
అభం,,శుభం తెలీని,,
పాలుగారే పసిబిడ్డల ఉసురు,,
తీసిన వాళ్ళను,,
అంగాంగం నరికి చిత్రవధ చేసి చంపక,,,
కాలయాపన చేస్తుంటే,,
బతికే ఉన్నామా యింకా ఊపిరితో???
మానవత్వం మరిచి,,
సభ్య సమాజపు పచ్చి స్వార్థపు కోరల్లో???
బతికే ఉన్నామా యింకా ఊపిరితో?????
(తల్లడిల్లుతున్న సగటు తల్లి తపన తప్ప
ఏం చేయగలను తల్లీ,,తిరిగి తేగలమా నిన్ను,,
నీ బోసి నవ్వులను,,, )

Aksharamaala
ReplyDelete